Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on ఈశా, నిన్ను ఎరిగింది లేదు !!
ఈశా, నిన్ను ఎరిగిందీ లేదు, చూసిందీ లేదు – ఎవరెవరో ఎమేమో చెప్తారు. ఎలా వుంటావు నువ్వు ? పడుచు నడుము ఒయ్యారపు ఒంపులపై తుంటరి మొటిమంత అందంగా ఉంటావా ? వలపు వయసుల వేడి నిట్టూర్పులను దాటి ఉంటుందా నీ కౌగిలి వెచ్చదనం ? కొంటె చందమామ కొసరి కొసరి విసిరే వెన్నెల పూల కంటే హాయిగా ఉంటుందా నీ నవ్వు ? వైరాగ్యపు వీరుడవట, తామరాకుతో నైనా తూగగలవా – బూడిదైనా అంటదే దానికి ! నటరాజువట, ఏదీ, మా మయూరినైనా తలదన్నగలవా –...