నేస్తం,
ఓ అరనవ్వైనా కొసరి విసర రాదు, ….ప్రక్రుతిలోని అందాలన్నీ దోచేసి నిన్ను అలంకరించేస్తా…
ఆ పున్నమి చంద్రుని తెచ్చి, నీకు చెవిపోగు గా చెయ్యనూ
అమావాస్య చీకటిలో, నా చిటికిన వేలు ముంచి నీ కనులకు కాటుక అద్దనూ..
సప్తవర్న ఇంద్రదనుస్సుని దొంగిలించి, నీకు ఆరడుగుల చీరగా చుట్టేస్తా..
ఉదయ భానుడి సిగ్గు కొంచెం అరువు తెచ్చి, నీ నుదిటిన తిలకంగా దిద్దనా..
రాతిరి కనిపించే చుక్కలన్నీ ఏరి, ఆ వయ్యారాల సొగసు పై వడ్డానం గా అమర్చను..
వెన్నెల దొంతరలన్నీ పేర్చి పేర్చి, నీ నగుమోము పై మేలి ముసుగు కప్పనూ
నీలి మేఘాల్ని బందించి, నీవు నడిచే దారినంతా తివాచీగ పరచనూ…
తెలుగు లోని అందమైన పదాలన్ని ఏర్చి కూర్చి, నా ప్రణయ ప్రణవ కవితలతో నీ పాద పూజ చేస్తూ ఎప్పటికి నీ భక్తుడి నై నేనుండిపోనూ !