ఈశా, వరమివ్వవూ..
నిశీధి శ్మశాన ఏకాంతంలో ప్రియ సఖిపై తీపి కలలుకనే నా శయనానికి, ధైర్యాన్ని…..
కడలి లలన అలల ఒంపులపై నా అలపు మరచు ఆటలకు, నిశ్చలత్వాన్ని…..
నిర్జన నడి ఎడారిలో ఆ గుప్పెటి నీటినీ..నేల తల్లి దప్పికకై దానమిచ్చే, కరుణని…..
జనారణ్యపు ఆశల ఘోషలలో, హాయిల మాయలలో…’సత్య’పు ఊపిరి ఆగని, వైరాగ్యాన్ని…
క్షణమొక యుగమవ్వగ, నీ తాపంలో పరితపించే ఈ విరహ హృదయానికి, సహనాన్ని…!!