Mohan Bhupathiraju's Blog !

ఈశా, నిన్ను ఎరిగింది లేదు !!

rsz_1lotus-wallpaper_1024x768_16274

ఈశా,

నిన్ను ఎరిగిందీ లేదు, చూసిందీ లేదు – ఎవరెవరో ఎమేమో చెప్తారు. ఎలా వుంటావు నువ్వు ?

పడుచు నడుము ఒయ్యారపు ఒంపులపై తుంటరి మొటిమంత అందంగా ఉంటావా ?

వలపు వయసుల వేడి నిట్టూర్పులను దాటి ఉంటుందా నీ కౌగిలి వెచ్చదనం ?

కొంటె చందమామ కొసరి కొసరి విసిరే వెన్నెల పూల కంటే హాయిగా ఉంటుందా నీ నవ్వు ?

వైరాగ్యపు వీరుడవట, తామరాకుతో నైనా  తూగగలవా – బూడిదైనా అంటదే దానికి !

నటరాజువట, ఏదీ, మా మయూరినైనా తలదన్నగలవా – ఆషాడపు నులివెచ్చని సాయంత్రాన !

అంతా తేజస్సేనట, ఏం, మా మధ్యాహ్న భాస్కరుని సెగ తగలలేదా ఇంకా నీకు !

సౌమ్యుడవట, వసంతపు వేకువలో కోయిల పాట వినబడలేదా ? అంతకంటె సౌమ్యమా నీ మాట !!

 

Comments are closed.

Powered by WordPress | Designed by Elegant Themes