Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on ప్రేయసిలా కవ్విస్తూ శత్రువులా ఓడిస్తావు…
జీవితమా, ఏల నాపై ఈ అవ్యాజ ప్రేమ ! రేపటిపై ఆశతో క్షణక్షణం నిరీక్షణలో నేను, మరుక్షణమే నీ పరిహాసంతో, ప్రతీక్షణం నీ పాదాల చెంతకే నేను….. ఉషోదయపు పొంగున నే ఉరకలేస్తుంటే, వెన్నెల ఆశని చూపి కారు చీకట్లో ముంచేస్తావు ఇక నీ చిత్తము ఎరుకైందని మిడిసిపడుతుంటే, నా అజ్ఞానాన్ని అద్దంలో చూపి వెక్కిరిస్తావు…. నువ్వూ నేను… ఏమౌతాం ఒకరికి ఒకరం ? ప్రేయసిలా కవ్విస్తూ శత్రువులా ఓడిస్తావు… ఏనాడైనా ప్రశ్నించానా నీ...
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on వలపుల జడివానకో వైరాగ్యపు గొడుగు !
వలపుల జడివానకో వైరాగ్యపు గొడుగు పట్టాను , నడక రాని పసి పాపలా పడుతూ లేస్తున్నాను. కనులేమో కలువలైనవి, కాలమేమో జారుతున్నది…. నిన్నుగనే క్షణమెప్పుడో తెలియకున్నా, ముత్యపు చిప్పనై ‘స్వాతి చినుకు’కై ఎదురు చూస్తున్నా ! హితులను వదిలి, సన్నిహితులని విడిచి, అంతా నీవేనని మోజులో పడ్డాను…. పయనం ఒంటరిదైనా నీ పై...
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on ఈశా, నిన్ను ఎరిగింది లేదు !!
ఈశా, నిన్ను ఎరిగిందీ లేదు, చూసిందీ లేదు – ఎవరెవరో ఎమేమో చెప్తారు. ఎలా వుంటావు నువ్వు ? పడుచు నడుము ఒయ్యారపు ఒంపులపై తుంటరి మొటిమంత అందంగా ఉంటావా ? వలపు వయసుల వేడి నిట్టూర్పులను దాటి ఉంటుందా నీ కౌగిలి వెచ్చదనం ? కొంటె చందమామ కొసరి కొసరి విసిరే వెన్నెల పూల కంటే హాయిగా ఉంటుందా నీ నవ్వు ? వైరాగ్యపు వీరుడవట, తామరాకుతో నైనా తూగగలవా – బూడిదైనా అంటదే దానికి ! నటరాజువట, ఏదీ, మా మయూరినైనా తలదన్నగలవా –...