Posted by
Mohan Bhupathiraju in
Poetry,
Telugu |
Comments Off on ఓ అర నవ్వైనా కొసరి విసరరాదు…!
నేస్తం, ఓ అరనవ్వైనా కొసరి విసర రాదు, ….ప్రక్రుతిలోని అందాలన్నీ దోచేసి నిన్ను అలంకరించేస్తా… ఆ పున్నమి చంద్రుని తెచ్చి, నీకు చెవిపోగు గా చెయ్యనూ అమావాస్య చీకటిలో, నా చిటికిన వేలు ముంచి నీ కనులకు కాటుక అద్దనూ.. సప్తవర్న ఇంద్రదనుస్సుని దొంగిలించి, నీకు ఆరడుగుల చీరగా చుట్టేస్తా.. ఉదయ భానుడి సిగ్గు కొంచెం అరువు తెచ్చి, నీ నుదిటిన తిలకంగా...
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on లలన అలల ఒంపులపై…
ఈశా, వరమివ్వవూ.. నిశీధి శ్మశాన ఏకాంతంలో ప్రియ సఖిపై తీపి కలలుకనే నా శయనానికి, ధైర్యాన్ని….. కడలి లలన అలల ఒంపులపై నా అలపు మరచు ఆటలకు, నిశ్చలత్వాన్ని….. నిర్జన నడి ఎడారిలో ఆ గుప్పెటి నీటినీ..నేల తల్లి దప్పికకై దానమిచ్చే, కరుణని….. జనారణ్యపు ఆశల ఘోషలలో, హాయిల మాయలలో…’సత్య’పు ఊపిరి ఆగని, వైరాగ్యాన్ని… క్షణమొక యుగమవ్వగ, నీ తాపంలో పరితపించే ఈ విరహ హృదయానికి,...
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on నీ ముంగిరులే హిమగిరులవ్వగ…
భారతీ ! నీ ముంగిరులే హిమగిరులవ్వగ…హిందు సాగరమే నీ పాద పూజలో తరియింపగ… ప్రాశ్చాత్యం కన్నైనా తెరవక మునుపే, ఖగోళం విడమర్చావు… మతాలంటే ఎరుగని నాడు, సనాతనమై ‘అహం బ్రహ్మస్మి’ అన్నావు. గ్రీకువీరుని జైత్రయాత్రలకు నీ వైభవంతో తెరదించినావు.. అశోకుడి అహింసా ఖడ్గంచే జగత్తునే జయించినావు… రాత మార్చే ‘గీత’నిచ్చిన కృష్ణుడు, ‘గీత’ దాటిన సీత కోసం వేటకేగిన రాముడు…....
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on ప్రేయసిలా కవ్విస్తూ శత్రువులా ఓడిస్తావు…
జీవితమా, ఏల నాపై ఈ అవ్యాజ ప్రేమ ! రేపటిపై ఆశతో క్షణక్షణం నిరీక్షణలో నేను, మరుక్షణమే నీ పరిహాసంతో, ప్రతీక్షణం నీ పాదాల చెంతకే నేను….. ఉషోదయపు పొంగున నే ఉరకలేస్తుంటే, వెన్నెల ఆశని చూపి కారు చీకట్లో ముంచేస్తావు ఇక నీ చిత్తము ఎరుకైందని మిడిసిపడుతుంటే, నా అజ్ఞానాన్ని అద్దంలో చూపి వెక్కిరిస్తావు…. నువ్వూ నేను… ఏమౌతాం ఒకరికి ఒకరం ? ప్రేయసిలా కవ్విస్తూ శత్రువులా ఓడిస్తావు… ఏనాడైనా ప్రశ్నించానా నీ...
Posted by
Mohan Bhupathiraju in
Telugu |
Comments Off on వలపుల జడివానకో వైరాగ్యపు గొడుగు !
వలపుల జడివానకో వైరాగ్యపు గొడుగు పట్టాను , నడక రాని పసి పాపలా పడుతూ లేస్తున్నాను. కనులేమో కలువలైనవి, కాలమేమో జారుతున్నది…. నిన్నుగనే క్షణమెప్పుడో తెలియకున్నా, ముత్యపు చిప్పనై ‘స్వాతి చినుకు’కై ఎదురు చూస్తున్నా ! హితులను వదిలి, సన్నిహితులని విడిచి, అంతా నీవేనని మోజులో పడ్డాను…. పయనం ఒంటరిదైనా నీ పై...